Andhra PradeshHome Page Slider

ఏపీకి రానున్న తొలి వందే మెట్రో

భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో తొలి వందే మెట్రో రైలు ప్రారంభం కానుంది. సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణం కోసం వేగంగా వెళ్లగల వందేభారత్ రైళ్లను తీసుకొచ్చినట్లే నగరాల మధ్య వందే మెట్రో రైళ్లను ప్రవేశపెడుతోంది. ఇటీవల గుజరాత్‌లోని భుజ్ నుండి అహ్మదాబాద్ మధ్య తొలి వందే మెట్రో రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే ఏపీలోని శ్రీకాకుళం- విశాఖపట్నం మధ్య కూడా వందే మెట్రో రైలును ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కోరారు. తాజాగా జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ మీటింగులో ఈ విషయం రైల్వే అధికారులను కోరారు. దీనితో ఈ రైలు పట్టాలెక్కనుంది. శ్రీకాకుళం నుండి విశాఖ రోజూ వచ్చేవారి సంఖ్య ఎక్కువని వారిని దృష్టిలో పెట్టుకుని ఈ రైలును ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. అలాగే శ్రీకాకుళం నుండి సికింద్రాబాద్, తిరుపతి నగరాలకు కూడా కొత్త రైలు సర్వీసులు ప్రారంభించాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అధికారులు సూచించారు. ఇంటర్ సిటీ రైళ్లకు ప్రత్యామ్నాయంగా ఈ రైళ్లు నడుస్తాయి.