ఇండియాలోనే తొలిసారి ! ఆ ఘనత మన హైదరాబాద్ దే…
ఇండియాలోనే తొలిసారిగా మన హైదరాబాద్‌లోని AIG ఆసుపత్రి వైద్యులు ఒక మహిళకు మెదడులో ఏర్పడిన కనితిని కంటి సాకెట్ ద్వారా ఆపరేషన్ చేసి తొలగించారు.
పుర్రె ఎముకను కట్ చేయకుండా , న్యూరో ఎండోస్కోప్ ద్వారా కంటి పైన చిన్న హోల్ చేసి దాని ద్వారా మెదడుకు చేరుకొని ఆపరేషన్ చేశారు.
ఈ ప్రక్రియ ద్వారా చుట్టుపక్కల నున్న కణజాలాలకు ఎక్కువ గాయాలు అవవని వైద్యులు తెలిపారు. మరియు దీని ద్వారా మెదడుపై ప్రభావం ఉండదని తెలిపారు.
ఈ ఆపరేషన్ ప్రక్రియ పూర్తయిన రెండవ రోజే ఆమెని డిశ్చార్జ్ కూడా చేశారు.