అతి త్వరలో రానున్న “BRO” ఫస్ట్ సింగిల్
సముద్రఖని దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా BRO. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తూ..ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో లేటెస్ట్ అప్‌డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అతి త్వరలోనే రానున్నట్లు సమాచారం. కాగా BRO ఫస్ట్ టీజర్ అతి త్వరలోనే వస్తుందని థ్రెడ్ యాప్‌లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పోస్ట్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ మేరకు ట్విటర్‌లో #BroFirstSingle ట్రెండ్ అవుతోంది.

