అమెరికా పోలింగ్ కాకుండానే మొదటి ఫలితం..
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో నేడు పోలింగ్ జరగనుండడంతో ప్రపంచవ్యాప్తంగా అందరి కళ్లూ అమెరికా ఎన్నికల పైనే ఉన్నాయి. న్యూహ్యాంప్‌షైర్ అనే రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్‌లో మొదటి ఫలితం వెల్లడి అయ్యింది. ఊహించినట్లుగానే పోటాపోటీగా ఫలితం వచ్చింది. అక్కడ ఆరు ఓట్లు ఉండగా, కమలాహారిస్‌కు మూడు ఓట్లు, డొనాల్డ్ ట్రంప్‌కు మూడు ఓట్లు వచ్చాయి. ఇక్కడ అర్థరాత్రి నుండే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో మిగిలిన పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ కంటే ముందే ఇక్కడ జరగడం ఆచారం. గత ఎన్నికలలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు మెజారిటీ ఓట్లు లభించాయి.

