Home Page SliderNational

ధోని ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ఫస్ట్ మూవీ ట్రైలర్ విడుదల

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇటీవల  ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే దీనికి ధోని ఎంటర్‌టైన్‌మెంట్ అని నామకరణం చేయగా..ఈ సంస్థ నిర్మించిన తొలి చిత్రం LGM ట్రైలర్,మ్యూజిక్ కార్యక్రమం నేడు చెన్నైలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ధోని,ఆయన సతీమణి సాక్షి చెన్నై చేరుకున్నారు. కాాగా అభిమానులు వారికి ఘనస్వాగతం పలికారు. అయితే ఈ LGM సినిమాకి రమేష్ తమిళమణి దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో హీరోగా హరీష్ కళ్యాణ్,లవ్ టుడే హీరోయిన్ ఇవానా నటించారు. అంతేకాకుండా ప్రముఖ నటి నదియా,కమెడియన్ యోగిబాబు కీలక పాత్రల్లో నటించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.