దేశంలోనే మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్
భారత్‌లోని మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌ను బెంగళూరులో ప్రారంభించారు. పైన మెట్రో రైళ్లు, కింద రోడ్డు మీద వాహనాలు వెళ్లే విధంగా దీనిని రూపొందించారు. రాగిగుడ్డ మెట్రోస్టేషన్ నుండి, సిల్క్ బోర్డు జంక్షన్ వరకూ 3.30 కిలోమీటర్ల పొడవుండే ఈ వంతెనను రూ.449 కోట్లతో నిర్మించారు. దీనివల్ల కనీసం అరగంట ప్రయాణం ఆదా అవుతుందని ప్రయాణికులు పేర్కొన్నారు.