అమెరికా గురుద్వారాలో ఖలిస్తానీల కాల్పులు
కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీలో గల గురుద్వారాలో నిన్న కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇది ఖలిస్తానీ సానుభూతి పరుల చర్యగా అనుమానిస్తున్నారు. దుండగులు ఇద్దరిపై కాల్పులు జరపగా, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పులు ముగ్గురు వ్యక్తులు జరిపినట్లుగా భావిస్తున్నారు. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయంపై ఈ మధ్య ఖలిస్థానీలు దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. కాగా దానిని అడ్డుకోవడం జరిగింది. ఓ ప్రక్క భారత్‌లో అమృత్‌పాల్‌ను అరెస్టు చేసేందుకు పంజాబ్ పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఖలిస్తానీ సానభూతి పరులు కొన్ని చోట్ల ఆందోళనలు జరుపుతున్నట్లు అనుమానిస్తున్నారు.

