బీజేపీ నేతపై కాల్పులు..బెంగాల్‌లో ఉద్రిక్తత
హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్‌కు న్యాయం కావాలంటూ ప్రజలు సెక్రటేరియట్‌ను ముట్టడించారు. దీనితో బెంగాల్‌లో బంద్ ఉద్రిక్తంగా మారింది. బీజేపీ నేత అర్జున్ సింగ్ కారుపై కాల్పులు జరిగాయని సమాచారం. విద్యార్థుల బంద్‌ను పోలీసులు బలప్రయోగం చేయడంతో బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. అర్జున్ సింగ్ ఈ బంద్‌లో పాల్గొనడం, విద్యార్థులకు మద్దతు తెలపడంపై కారుపై కాల్పులు జరిగాయి. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సువేందు అధికారి కూడా నందిగ్రామ్‌లో కార్యకర్తలతో కలిసి బంద్‌లో పాల్గొన్నారు.