Home Page SliderInternational

ఫ్రాగ్ యూనివర్శిటీలో కాల్పులు..15 మంది మృతి

చెక్ రిపబ్లిక్‌లోని ఫ్రాగ్ యూనివర్శిటీలో ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పులలో ఏకంగా 15 మంది మృతి చెందారు. 25 మంది గాయపడ్డారు. ఈ దుండగుడు యూనివర్శిటీకి చెందిన వ్యక్తేనని తెలిసింది. కాల్పుల అనంతరం అతడు కూడా మృతిచెందాడు. ప్రధాన పర్యాటక కేంద్రం చార్లెస్ యూనివర్సిటీకి చెందిన ఈ యూనివర్సిటీలో కాల్పులు జరగడంతో జనం పరుగులు తీశారు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తి బాగా చదివేవాడని, ఎందుకు ఇలాంటి మారణహోమానికి పాల్పడ్డాడో తెలియలేదని విద్యార్థులు చెప్తున్నారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. చుట్టుపక్కల ఇళ్లను కూడా ఖాళీ చేయించారు.