టమాటా పంటకు నిప్పు
ఆరుగాలం శ్రమించి సాగు చేసి కుప్పలు కుప్పలుగా పోగు చేసిన పంటకు గిట్టుబాటు ధర కూడా లభించకపోతే ఇక ఆ రైతు పరిస్థితి ఆత్మహత్యా శరణ్యమే.అలాంటి పంటలను సాగు చేసిన అన్నదాలది అరణ్య రోదనే.అలాంటి దుస్థితులకు మెదక్ జిల్లా శింపేట కేంద్రంగా మారింది. నవాబ్ పేట పరిసర ప్రాంతాల్లో ఈ ఏడాది విస్తృతంగా టమాటాను సాగు చేశారు.మంచి దిగుబడి లభించింది.తీరా అమ్మబోతే అడవిలా మారింది.వందల మెట్రిక్ టన్నలు టమాటా పొరుగు రాష్ట్రాలకు వందల రూపాయలకే అమ్మాల్సిన దుస్థితి దాపురించింది.దీంతో కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో కలత చెందిన అన్నదాతలు ఉన్న పంటను పూర్తిగా దగ్గం చేసి తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు.తెలంగాణ సర్కార్ కనీస గిట్టుబాటు ధర కూడా కల్పించకపోవడంతో రైతులు ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారు.