రెండు పార్టీలపై ఫైర్
తెలంగాణా సమాజాన్ని కల్వకుంట్ల కుటుంబం పదేళ్ల నుంచి నిలువు దోపిడీ చేసిందని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.బీజెపి కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.అదే పని బీజెపి చేస్తే అసలు తెలంగాణ లోకాంగ్రెస్ ఉంటుందా అని ప్రశ్నించారు.దాడికి బాధ్యత వహిస్తూ టిపిసిసి చీఫ్ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఫార్ములా ఈ కేసులో కేటిఆర్ జైలుకి పోక తప్పదని స్పష్టం చేశారు.ఏసిబి విచారణకు హాజరు కావాలని పిలుస్తుంటే.. కవిత,కేటిఆర్ ఇద్దరూ డిమాండ్లు పెట్టడమేంటంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.