ప్యారడైజ్ హోటల్ లో మంటలు
సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ హోటల్ లో ప్రమాదం సంభవించింది. హోటల్ సెల్లార్ లో మంటలు చెలరేగాయి. సెల్లార్ లో జనరేటర్ కాలిపోయిన కారణంగా మంటలు చెలరేగి పొగలు కమ్ముకున్నాయి. వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది కొద్ది సేపటికే మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. హోటల్లో భోజనం చేస్తున్న వారిని బయటకు పంపి ప్రాణం నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు. సెల్లార్ నుండి పెద్ద ఎత్తున పొగలు దట్టంగా రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు చేరుకొని ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు.