ఢిల్లీలో అగ్నిప్రమాదం
దేశ రాజధాని ఢిల్లీలో అగ్నిప్రమాదం సంభవించింది. షహదారా ప్రాంతంలోని ఓ ఇంట్లో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఘటనలో ఇద్దరు చనిపోగా, మరో నలుగురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని కైలాష్ గుప్తా, భగవతి గుప్తా, మనీష్ గుప్తాగా గుర్తించారు. ఇక చనిపోయిన వారు శిల్పి గుప్తా, ప్రణవ్ గుప్తాగా నిర్ధారించారు. భవనంలోని మూడు, నాలుగు అంతస్తుల్లో మంటలు చెలరేగడంతో ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. అయితే అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.