భవనంలో అగ్నిప్రమాదం..బాల్కనీలలో నుండి దూకిన బాధితులు
దేశరాజధాని ఢిల్లీలోని నాంగ్లోయూ ప్రాంతంలో ఒక భవనాన్ని అగ్నికీలలు చుట్టుముట్టాయి. మంగళవారం రాత్రి ఈ అగ్ని ప్రమాదం సంభవించడంతో అక్కడివారు భయాందోళనలకు గురయ్యారు. కొందరు బాల్కనీలలో నుండి దూకడంతో గాయాల పాలయ్యారు. వీరిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలలో భవనంలోని మంటలను అదుపుచేయడానికి చేస్తున్న ప్రయత్నం, భవనంలో వ్యాపించిన మంటల నుండి కాపాడుకోవడానికి రెండవ అంతస్తు నుండి దూకుతున్నవారిని గమనించవచ్చు.