బోయినపల్లిలో అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్‌లోని బోయినపల్లి వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బోయినపల్లి బాపూజీనగర్‌లో పోచమ్మ తల్లి ఆలయం పక్కనే ఉన్న కట్టెల దుకాణంలో మంటలు చెలరేగాయి. దీనితో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లు వాడి మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.

