ఎస్సై కుటుంబానికి స్నేహితుల ఆర్థిక సహాయం
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పోలీస్ స్టేషన్ లో రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఎస్సె ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి కుటుంబానికి తోటి మిత్రులు అండగా నిలిచారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరానికి చెందిన సత్య నారాయణమూర్తి ఇంటికి ఇవాళ ఆయన పోలీస్ బ్యాచ్ మిత్రులు వెళ్లి సాయం చేశారు. మూర్తికి భార్య విజయ లక్ష్మీ, హేమాన్షి, చందన అనే ఇద్దరు కూతుర్లు, వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు. దీంతో ఆయన కుటుంబానికి బ్యాచ్ పోలీసులంతా కలిసి రూ.45.68 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.

