ఏపీలో వరద బాధితులకు రూ.10,000/- ఆర్థిక సాయం
ఏపీలో గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏపీలోని వాగులు,వంకలు,నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఈ మేరకు ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు ముమ్మరం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.అయితే వరద బాధితులను సహాయ శిబిరాల నుంచి ఇళ్లకు పంపించేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2 వేల చొప్పున ,వ్యక్తులకైతే రూ.1000 చొప్పున ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు. అంతేకాకుండా వరదల కారణంగా దెబ్బతిన్న కచ్చా ఇళ్లను మరమత్తులు చేసుకోవడానికి రూ.10,000 తక్షణమే అందించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించినట్లు తెలుస్తోంది. వీటితోపాటు వరద బాధితులకు 25 కేజీల బియ్యం,కిలో ఉల్లిపాయలు,కిలో బంగాళదుంపలు,కిలో పామాయిల్ ఇవ్వాలని సీఎం జగన్ సూచించినట్లు అధికారులు వెల్లడించారు.