Home Page SliderNational

డిపాజిట్లను ఆకర్షించండి.. బ్యాంకులకు ఫైనాన్స్ మినిష్టర్ ఆదేశం

బ్యాంకులలో డిపాజిట్లు తగ్గుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రజల నుండి డిపాజిట్లను సేకరించేలా ఆకర్షణీయమైన పథకాలను రూపొందించాలని ఆమె ఆదేశించారు. ఆర్‌బీఐ బోర్డు సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రుణాలతో పాటు డిపాజిట్ల సేకరణపై దృష్టి పెట్టాలని, ఈ రెండిటి మధ్య సమతూకం ఉండాలని పేర్కొన్నారు. నూతన డిపాజిట్ల పథకాలను తీసుకురావాలని సూచించారు. దీనిపై ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, వడ్డీ రేట్లను డీ రెగ్యులేట్ చేశామని పేర్కొన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ పథకంలో బ్యాంకులు తమ డిపాజిట్లను పెంచుకోవడానికి వడ్డీ రేట్లను తామే స్వయంగా పెంచుకునే అవకాశం ఇచ్చామన్నారు.