ఎట్టకేలకు సీఎం ఫిక్స్
వారం రోజుల తర్జనభర్జనల అనంతరం అనేక సమావేశాలు నిర్వహించి ఎట్టకేలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేరును ప్రకటించింది బీజేపీ అధిష్టానం. మహారాష్ట్ర సీఎంగా అందరూ అనుకుంటున్నట్లు దేవేంద్ర ఫడ్నవీస్‌నే ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో సుధీర్ ముగంటివార్, చంద్రకాంత్ పాటిల్ ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రతిపాదించారు. దీనికి మిగిలిన సభ్యుల ఆమోదం లభించిందని సమాచారం. గురువారం డిసెంబర్ 5న ఆయన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం నిర్ణయించారు.
Breaking news:ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భూప్రకంపనలు..


 
							 
							