ఫైనల్‌గా అవైటెడ్ సినిమా బయోపిక్ బిగిన్…
ఇండియన్ టీమ్ క్రికెటర్స్‌లో స్టార్ అండ్ అగ్రెసివ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఒకరుగా చెప్పుకోవాలి. యువరాజ్‌కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా తాను క్రికెట్‌లో ఇదివరలో భారత జట్టుకి ఎలాంటి సేవలు అందించాడో అభిమానులకు తెలుసు. క్రికెట్ పరంగా ఇదివరకే బాలీవుడ్ నుండి పలు బయోపిక్ చిత్రాలు వచ్చిన సంగతీ తెలిసిందే. ఐతే ఎప్పటి నుండో ఫ్యాన్స్ యువరాజ్ బయోపిక్ సినిమా చూడాలని ఎదురు చూస్తున్నారు. ఫైనల్‌గా ఈ అవైటెడ్ సినిమా బయోపిక్ బిగిన్ అయినట్టుగా కన్ఫర్మ్ చేశారు ఫిల్మ్ మేకర్స్. బాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు భూషణ్ కుమార్ రవి భాగ్చందకలు నిర్మాణం వహిస్తుండగా ఈ సినిమాలో లీడ్ రోల్‌లో ఎవరు నటిస్తారు? ఎవరు దర్శకత్వం వహించనున్నారు అనేవి ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉన్నాయి. అలాగే ఇంకా టైటిల్ కూడా ఖరారు కాని ఈ సినిమా నుంచి మరిన్ని విశేషాలు తెలియాల్సి ఉంది. ఈ వార్త యువరాజ్ సింగ్ క్రికెట్ అభిమానులకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

