Home Page SliderTelangana

కేటీఆర్ పరుగులు.. చెల్లి కోసం ఆటో ఎక్కిన అన్న

ఎట్టకేలకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కింది. సుదీర్ఘ వాదనల అనంతరం సర్వోన్నత న్యాయస్థానం కవితకు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. ఈ రోజు రాత్రికి తీహార్ జైలు నుంచి కవిత రిలీజ్ కానున్నారు. కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే తదుపరి పత్రాలు సమర్పించేందుకు కేటీఆర్ న్యాయవాదులతో కలిసి ఉరుకులు పరుగులు పెట్టారు. బెయిల్ ప్రక్రియను వీలైనంత పూర్తి చేసేందుకు కేటీఆర్ ఏర్పాట్లు చేస్తున్నారు. సుప్రీం కోర్టు నుంచి తీహార్ జైలుకు బయలుదేరారు కేటీఆర్. భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడటంతో కేటీఆర్ కారు వదిలి చెల్లి కోసం ఆటో ఎక్కారు. బెయిల్ ప్రక్రియను సాయంత్రంలోగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తయితే.. సాయంత్రం నాటికి కవిత విడుదల కానున్నారు. ఈ రోజు కేటీఆర్, కవిత, హరీష్ రావు ఢిల్లీలోనే బస చేయనున్నారు. బుధవారం రోజున మీడియా సమావేశం నిర్వహించి అనంతరం మధ్యాహ్నం హైదరాబాద్ కు రానున్నారు.