శనివారం బీజేపీ అభ్యర్థుల ఎంపిక చివరి జాబితా విడుదల?
బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక చివరి జాబితా శనివారం విడుదలయ్యే అవకాశాలున్నాయి. శనివారం జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో ఖమ్మం, వరంగల్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఆరూరి రమేష్‌కు వరంగల్ టికెట్ ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఖమ్మం అభ్యర్థిపై స్పష్టత రావాల్సి ఉంది. అటు ఎపీలో పోటీచేసే అభ్యర్థులను కూడా రేపు ఎంపిక చేస్తారని తెలుస్తోంది.