Home Page SliderNational

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వీరికే..

2023ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌ విడుదల అయ్యాయి. ఈఅవార్డులలో ఉత్తమ చిత్రంగా ఆస్కార్ సాధించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి అత్యధిక అవార్డులు వరించాయి. ఉత్తమచిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి రాగా, ఉత్తమ దర్శకుని అవార్డు ఆ చిత్ర దర్శకుడు రాజమౌళిని వరించింది. ఉత్తమనటులుగా ఈ చిత్రంలోనే ‘నాటు నాటు’ అంటూ దుమ్ము రేపిన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు సంయుక్తంగా లభించింది. వీరితో పాటు ఈ చిత్ర మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్‌గా, ఆయన కుమారుడు కాలభైరవ బెస్ట్ సింగర్‌గా అవార్డు అందుకున్నారు. ‘నాటు నాటు’ పాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్‌రక్షిత్‌కు బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు లభించింది.

2023లో ఉత్తమ క్రిటిక్స్ చిత్రంగా ‘సీతారామం’ చిత్రం నిలిచింది. దీనిలో నటించిన హీరో దుల్కర్ సల్మాన్ బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ అవార్డు అందుకోగా, హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కు ఉత్తమనటి అవార్డు లభించింది.

రానా ఉత్తమ సహాయనటుడిగా, సాయిపల్లవి ఉత్తమ నటి క్రిటిక్స్, సిరివెన్నెల సీతారామశాస్త్రి ఉత్తమ గేయరచయిత, ప్రదీప్ ఉత్తమ డెబ్యూ యాక్టర్, సింగర్ చిన్మయి ఉత్తమగాయనిగా అవార్డులు సాధించారు.