తెలంగాణ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డ్
కుటుంబ అనుబంధాలను చాటుతూ తెలంగాణ నేపథ్యంలో రూపొందిన బలగం చిత్రం 69వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు (వేణు యెల్దండి) సహా పలు కేటగిరీల్లో పురస్కారాలు అందుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బలగం చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
ఉత్తమ నటుడు (నాని), ఉత్తమ నటి (కీర్తి సురేష్), బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ (శ్రీకాంత్ ఓదెలు) సహా అనేక కేటగిరీల్లో అవార్డులు పొందిన మరో తెలంగాణ నేపథ్య దసరా చిత్ర బృందాన్ని కూడా సీఎం అభినందించారు. పురస్కారాలు అందుకున్న అందరికీ ఒక సందేశంలో ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

