వరదబాధితులకు సినీతారల విరాళాలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పలువురు సినీతారలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. ప్రముఖనటుడు చిరంజీవి నేటి ఉదయం ముందుగా ప్రకటించిన రూ.50 లక్షల చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. అలాగే నేడు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారిని కలిసిన యువ నటుడు విశ్వక్ సేన్ 10లక్షల రూపాయల విరాళం చెక్కును అందజేశారు. మరో యువ నటుడు సాయి ధరమ్ తేజ్ 10 లక్షల విరాళం అందించారు. అలాగే, సీనియర్ నటుడు అలీ 3 లక్షల రూపాయల విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న వీరందరికీ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంలో సీఎం గారి వెంట మంత్రి సీతక్క , ఎంపీ కడియం కావ్య , ఇతర నేతలు ఉన్నారు.