కారుదిగి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసిన సినీ నిర్మాత సురేష్‌బాబు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ క్రమంలో నిన్న రాత్రి జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో అటువైపు వెళ్తున్న ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఆ ట్రాఫిక్‌లో ఇరుక్కున్నారు. ఏం చేయాలో తోచక… ఆయన స్వయంగా కారులోంచి దిగి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేశారు. వాహనదారులకు సూచనలు చేస్తూ ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. బాధ్యత గల పౌరుడిలా వ్యవహరించారంటూ సురేష్‌బాబుపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
