తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు రామ్‌చరణ్, ఉపాసన దంపతులు
తిరుమల శ్రీవారిని సినీనటుడు రామ్‌చరణ్, ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. కుమార్తె క్లీంకారతో కలిసి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. నేడు రామ్‌చరణ్ పుట్టినరోజు కావడంతో దర్శనానికి వచ్చారు. అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనానికి కావలసిన ఏర్పాట్లు చేశారు.