Home Page SliderInternationalSports

కోహ్లితో ఫైట్..సామ్ కాన్‌స్టాస్ ఐదు రోజుల బ్యాన్..

ఆస్ట్రేలియా యువ కెరటం ఓపెనర్ సామ్ కాన్‌స్టాస్‌కు మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్‌లోనే విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. టీమిండియా టాప్ స్టార్స్ బుమ్రా బౌలింగ్‌లో అద్భుతాలు సృష్టించాడు. దీనితో హీరో అయిపోయాడు. కాన్‌స్టాస్‌ జస్రిత్ బుమ్రాను విజయవంతంగా ఎదుర్కోవడమే కాదు. విరాట్ కోహ్లితో గొడవ పెట్టుకోవడం కూడా క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. తనపై ఇన్‌స్టాగ్రామ్ ఐదు రోజుల బ్యాన్‌ను విధించిందని స్వయంగా మీడియాతో చెప్పాడు. అయితే గతంలో అతని ఇన్‌స్టా ఫాలోవర్స్ 24 వేల నుండి లక్షకు పైగా పెరిగింది. డిసెంబర్ 26న గురువారం ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టులో తొలిరోజు 65 బంతుల్లో 60 పరుగులు చేసి, ఆస్ట్రేలియా అభిమానుల దృష్టిలో హీరో అయ్యాడు.