Home Page SliderNational

నచ్చిన పాత్ర కోసం గొడవపడ్డా..: మృణాల్‌ ఠాకూర్‌

‘సీతారామం’, ‘హాయ్‌ నాన్న’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మృణాల్‌ ఠాకూర్‌. ప్రస్తుతం ఈ భామ హిందీలో సైతం వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నా రియల్‌లైఫ్‌కు దగ్గరి సంబంధం ఉన్న పాత్రను పోషించా. ఎప్పటి నుంచో ఈ తరహా పాత్ర కోసం చూస్తున్నా. ఈ సినిమా కోసం మరొక నాయికను ఎంచుకుంటున్నారని తెలిసి నిర్మాతలతో గొడవకు దిగాను. ఆ క్యారెక్టర్‌ నేనే చేస్తానని ప్రాధేయపడ్డాను. ఆ పాత్ర నన్ను అంతలా ఇంప్రెస్‌ చేసింది. నా కెరీర్‌లో గొప్ప పాత్రగా మిగిలిపోతుంది’ అని చెప్పింది. ‘పూజా మేరీ జాన్‌’ చిత్రానికి విపాషా అరవింద్‌ దర్శకత్వం వహించారు. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.