జూబ్లీహిల్స్ ఎన్నికపై ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన “స్థానికులకే టికెట్ ఇస్తాం” అన్న వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టికెట్ ఎవరికి ఇవ్వాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయించేదే తప్ప, వ్యక్తిగతంగా ఎవరో నిర్ణయించే విషయం కాదన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది, ఒక వ్యక్తి కాదు అని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మరణంతో జూబ్లీహిల్స్ లో ఆ పార్టీకి కొంత సానుభూతి ఉందన్న అభిప్రాయం కూడా ఆయన వ్యక్తపరిచారు. అంతేకాదు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు వయనాడ్‌లో పుట్టి పెరిగారా? అయినా కూడా వాళ్లు అక్కడ నుంచి ఎలా పోటీ చేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. ఇలా ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత విభేదాలను వెలుగులోకి తెస్తున్నాయి..

