చెన్నై ,శ్రీలంకకు ఫెంగల్ ముప్పు
అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది…అది తుఫాన్‌గా రూపాంతంరం చెందింది.నాలుగు రోజుల నుంచి సముద్ర ఉపరితలంపై అల్లకల్లోలం సృష్టిస్తూ తీరం దాటి జనజీవనాన్ని కకావికలం చేసేందుకు ఫెంగల్ తుఫాన్ ఉవ్విళ్లూరుతుంది.ఫలితంగా తూర్పు కోస్తా అంతా బీభత్సంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మూడు నాలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలుండబోతున్నాయని వాతావరణ శాఖ వారం రోజుల కిందటే హెచ్చరించింది.ఈ నేపథ్యంలో బుధవారం ఫెంగల్ తుఫాన్ తీరం దాటబోతుంది. తమిళనాడు,ఆంధ్ర,పుదుచ్చేరితో పాటు తెలంగాణలోనూ భారీ వర్షాలుండబోతున్నాయి.ఇప్పటికే సముద్రతీరం అల్లకల్లోలంగా మారింది.జాలర్లు ఎవరూ వేటకు వెళ్లలేదు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి నుంచి చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి. తమిళనాడు,శ్రీలంక మధ్య ఈ తుఫాన్ తీరం దాటనుంది.తీరం దాటిన రెండు రోజుల పాటు ఆయా రాష్ట్రాలకు అతి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.