కాపురంలో ఇన్ స్టా చిచ్చు..
హర్యానాకు చెందిన దంపతుల కాపురంలో ఇన్ స్టా చిచ్చు పెట్టింది. ఇన్ స్టా లో పరిచయమైన వ్యక్తితో ప్రేమాయణం సాగించిన మహిళ.. చున్నీతో భర్తకు ఉరి బిగించి చంపింది. వివరాల్లోకి వెళితే.. హర్యానా భివానీకి చెందిన యూట్యూబర్ రవీనా(32), సురేష్(25)ల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. గత నెల 26న అభ్యంతరకర స్థితిలో దొరకడంతో భర్త ప్రవీణ్(35)ను గొంతు కోసి చంపి, మృతదేహాన్ని బైక్‌పై మురుగు కాల్వలో పడేశారు. ప్రవీణ్ కనిపించకపోవడంతో అతడి తల్లిదండ్రులు హర్యానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా డెడ్ బాడీని బైక్ పై తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీంతో రవీనాను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రియుడు సురేశ్ తో కలిసి ప్రవీణ్ ను హత్య చేసినట్టు ఒప్పుకుంది. అయితే పరారీలో ఉన్న సురేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.