Home Page SliderTelangana

ఘోర రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి

జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహిళా ఎస్సె మృతి చెందింది. జగిత్యాల జిల్లా డి సి ఆర్ బి లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న కొక్కుల శ్వేత గొల్లపల్లి వైపు నుండి జగిత్యాల వస్తుండగా చిల్వకోడూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి చెట్టును బలంగా ఢీ కొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఎస్సై శ్వేత తో పాటు బైక్ పైన ఉన్న మరో వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీలను జగిత్యాల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.