Home Page SliderInternational

2025 ఆస్కార్‌ ఎంట్రీకి ఇండియా నుండి మహిళా చిత్రం

మనదేశం నుండి 2025 ఆస్కార్ ఎంట్రీ కోసం ఫిల్మ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా “లాపతా లేడీస్” అనే మహిళా చిత్రాన్ని ఎంపిక చేసింది. మహిళా దర్శకురాలు కిరణ్ రావు రూపొందించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అమాయకమైన పల్లెటూరి మహిళల జీవిత కథతో రూపొందించిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇద్దరు కొత్తగా వివాహమైన వధువులు రైలు ప్రయాణంలో మారిపోవడంతో ఈ కథ చాలా ఆసక్తిని కలిగించింది. ఈ చిత్రంలో అనవసరమైన మెలోడ్రామా లేకుండా చక్కగా చిత్రాన్ని రూపొందించారు కిరణ్ రావు. ఆమె బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మాజీ భార్య. ఈ చిత్రం ఆస్కార్‌కు ఎన్నికవుతుందని గతంలోనే ఆశాభావం వ్యక్తం చేశారు కిరణ్ రావు. చివరి రౌండుకు సెలక్టయిన 29 చిత్రాల లిస్టు నుండి చివరికి ఈ చిత్రం ఆస్కార్‌కు భారత్ నుండి ఎన్నికయ్యింది.