Home Page SliderInternationalNewsPolitics

ట్రంప్ ఆదేశాలపై ఫెడరల్ కోర్టు స్టే..భారతీయులకు ఊరట

అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ అనేక నూతన చట్టాలపై అధికారంలోకి వచ్చిన వెంటనే సంతకం చేశారు. వీటిలో భారతీయులకు అత్యంత ఆందోళన కలిగించిన అంశం పుట్టుకతో పౌరసత్వ హక్కు రద్దు. అయితే వారికి ఈ విషయంలో ఊరట లభించింది. అమెరికాలోని సియాటిల్ ఫెడరల్ కోర్టు ఈ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్దమని పేర్కొన్నారు. జనవరి 20న ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఈ చట్టంపై ఆమోద ముద్ర వేసిన ట్రంప్‌పై డెమెక్రాట్ల నేతృత్వంలోని పలు రాష్ట్రాలు కోర్టుకెక్కాయి. వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయిస్ వంటి 22 రాష్ట్రాలు, పౌరసంఘాలు ఈ నిర్ణయంపై దేశంలోని పలు కోర్టులలో దావాలు వేశాయి. అయితే సియాటిల్ కోర్టు ట్రంప్ నిర్ణయంపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.