ఉగ్రభయం..! రైల్వే ట్రాక్ బోల్ట్ లు తొలగింపు..
పహెల్గాం ఉగ్రదాడిలో నేపథ్యంలో చెన్నైలోని అర కోణంలో జరిగిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. గురువారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు రైల్వే ట్రాక్ బోల్టులను తొలగించారు. రైల్వే అధికారులు అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఆ ట్రాక్ పై ప్రయాణించే పలు రైళ్లను బెంగళూరు, కేరళ వైపు మళ్లించారు. ఈ క్రమంలో పలు ట్రైన్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇది ఆకతాయిల దుర్చర్య లేకుంటే ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా విచారణను ముమ్మరం చేశారు.