Home Page SliderNational

పరీక్షల భయంతో.. స్టూడెంట్ బాంబు బెదిరింపులు

పరీక్షలు తప్పించుకోవడానికే ఓ విద్యార్థి 23 పాఠశాలలకు బాంబు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన భారత రాజధాని ఢిల్లిలో చోటు చేసుకుంది. 23 స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన ఘటనలో 12వ తరగతి విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాఠశాలలో పరీక్ష జరగకూడదనే అతడు బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు తేల్చారు. అయితే, కొన్నివారాల క్రితం ఢిల్లీలోని స్కూళ్లకు వరుస బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేపట్టారు. బెదిరింపులు వెనక విద్యార్థి పాత్ర ఉందని అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాంబు బెదిరింపులకు పాల్పడుతూ ఆరుసార్లు మెయిల్స్ పంపినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతిసారి తాను చదివే స్కూల్ కి కాకుండా వేరే పాఠశాలలకు మెయిల్స్ పంపాడన్నారు. అనుమానం రాకుండా ఉండటానికి ఎప్పుడూ మెయిల్ లో పలు స్కూళ్లను ట్యాగ్ చేశాడని పేర్కొన్నారు. ఇలా చేస్తే, పరీక్షలకు అంతరాయం కలుగుతుందని.. వాటిని రద్దు చేస్తారని అతడు భావించినట్లు పోలీసులు పేర్కొన్నారు.