‘ఫౌజీ’ షూటింగ్ First, ‘స్పిరిట్’ Next
కల్కి సినిమాతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాడు ప్రభాస్. ఏకంగా వెయ్యి కోట్ల కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. అయితే, ప్రభాస్ నెక్ట్స్ చిత్రాలపై అప్పుడే సినీ సిర్కిల్స్‌లో జోరుగా చర్చ సాగుతోంది.
సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ సినిమాలోనూ ఆయన నటిస్తాడు. అయితే, ప్రభాస్ తొలుత ‘స్పిరిట్’ సినిమానే స్టార్ట్ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ, ప్రీ-ప్రొడక్షన్ పనులకు మరింత సమయం పడుతుండటంతో, ప్రభాస్ హను రాఘవపూడితో సినిమాను ప్రారంభించాలని అనుకుంటున్నాడు.
ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోందట. స్పిరిట్ చిత్రం షూటింగ్‌ను 2025 ప్రథమార్థంలో ప్రారంభించాలని ప్రభాస్ ప్లాన్‌లో ఉన్నాడు. ఇక ఫౌజీ సినిమా 1940ల నేపథ్యంలో సాగే కథగా రాబోతోందని.. ఈ సినిమాలో అందాల భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. మరి నిజంగానే ప్రభాస్ ఫౌజీ సినిమాకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాడా.. నిజంగానే స్పిరిట్ సినిమాను వచ్చే ఏడాది ప్రారంభిస్తాడా..? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

