కన్యాదానం చేసిన కాసేపటికే.. తండ్రి మృతి
ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. కూతురికి కన్యాదానం చేసిన కాసేపటికే తండ్రి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. తండ్రి గుండెపోటుతో మృతి చెందడం స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన బాలచంద్రం అనే వ్యక్తి తన కూతురు పెళ్లి వేడుకలలో భాగంగా కూతురు కాళ్లు కడిగిన అనంతరం అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

