Andhra PradeshNews

కుమార్తెలను చెరువులో తోసేసి తండ్రి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడిని తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఇద్దరు కుమార్తెలను కూడా చంపేశాడు. రాజమహేంద్రవరం నగరంలోని పీఎల్‌ పురం ప్రాంతంలో నివసిస్తున్న సత్యేంద్ర కుమార్‌ (40) వ్యాపారస్తులకు జీఎస్టీ సంబంధిత బిల్లులు చేసి పెట్టేవాడు. అతడికి భార్య స్వాతి, కుమార్తెలు రిషిత (12), హాద్విక (7) ఉన్నారు. భార్య ఆదివారం బంధువుల ఇంటికి ఫక్షన్‌కు వెళ్లింది. సత్యేంద్ర సోమవారం ఉదయం ఇద్దరు కుమార్తెలతో కలిసి రాజమహేంద్రవరం గ్రామ పరిధి రాజవోలు రోడ్డులోని చేపల చెరువు వద్దకెళ్లాడు. ఇద్దరు కూతుళ్లను చెరువులో తోసేసి.. తాను కూడా అందులోకి దూకేశాడు. తన మృతికి ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడే కారణమని స్యూసైడ్‌ నోట్‌ రాసినట్లు పోలీసులు తెలిపారు.