ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం
హైదరాబాద్ శివారు హయత్‌నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంట్లూరులో ఎదురుగా వస్తున్న డీసీఎంను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు బయటికి తీశారు. మృతులు చంద్రసేన రెడ్డి (24), త్రినాధ్ రెడ్డి (24) వర్షిత్ రెడ్డి (23)గా పోలీసులు గుర్తించారు. అందరూ ఒకే గ్రామానికి చెందినవారు.

