Home Page SliderNational

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఏపీకి చెందిన ఏడుగురు మృతి చెందారు. మహా కుంభమేళా నుంచి తిరిగొస్తుండగా NH-30 పై మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ జిల్లా సిహోరా వద్ద వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. గాయాలైనవారికి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.