కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ యూసుఫ్ గూడకు చెందిన కుటుంబం గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రానికి వెళ్తుండగా గుల్బర్గా జిల్లా కమలాపురం వద్ద నిన్న అర్ధరాత్రి వారు ప్రయాణిస్తున్న కారు బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. మృతి చెందిన వారిని భార్గవ కృష్ణ (55), భార్య సంగీత (45), కుమారుడు ఉత్తమ్ రాఘవ (28), రాఘ వేంద్ర గౌడ్ (కారు డ్రైవర్) గా గుర్తించారు.

