ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం
ఏలూరు జిల్లా సోమవరప్పాడు దగ్గర జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.హైద్రాబాద్ నుంచి కాకినాడుకు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి..ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణీకులు అక్కడికక్కడే మరణిచారు.మరో 15 మంది ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ సహా 8 మంది పరిస్థితి విషమంగా ఉంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి ట్రాఫిక్‌ని క్రమబద్దీకరించారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం ఏలూరు పెద్దాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.