ఘోర ప్రమాదం..రెండు బస్సులు ఢీ
ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి వద్ద రాయల్పాడులో రెండు ప్రైవేట్ బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టాయి. దీంతో బస్సులు ముందు భాగం నుజ్జునుజ్జుగా మారింది. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి ప్రమాదకరంగా ఉండగా, 40 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిని కోలార్, శ్రీనివాసపురం, మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు. 25 మంది డిశ్చార్జ్ అయ్యారని సమాచారం.