యూపీలో ఘోర ప్రమాదం..10 మంది మృతి
యూపీలోని మీర్జాపూర్- ప్రయాగ్‌రాజ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డుపై వెళ్తున్న బస్సును ఒక బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. బొలెరోలో ప్రయాణికులు కుంభమేళాకు వెళ్తున్నట్లు సమాచారం. ఛత్తీస్‌ఘఢ్‌లోని కోర్బాకు చెందిన పలువురు ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు బొలెరోలో ప్రయాణమయ్యారు. ఈ జీపు మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌కు చెందిన భక్తులను తీసుకెళ్తున్న బస్సును ఢీకొట్టింది. దీనితో బొలెరో వాహనంలోని 10 మంది మృతి చెందారు.బస్సులోని 19 మందికి గాయాలయ్యాయి. మరణించినవారందరూ ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారని సమాచారం. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పర్యవేక్షించి, సహాయక చర్యలకు అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.

