ఉపవాసంతో క్యాన్సర్ బారి నుండి రక్షణ
క్యాన్సర్ మహమ్మారి బారి నుండి తప్పించుకోవడానికి ఉపవాసం చేయడం చక్కని మార్గమని వైద్యనిపుణులు పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. క్యాన్సర్‌పై అనేక రకాల ట్రీట్‌మెంట్లు ఉన్నప్పటికీ, దీనిని ముందుగా గుర్తించడం పెద్ద సవాలుగా మారింది. క్యాన్సర్‌పై జరిగిన కొన్ని పరిశోధనల కారణంగా ఉపవాసం చేయడం ద్వారా, బరువు తగ్గడం వల్ల క్యాన్సర్ కణితిని తగ్గించుకోవచ్చు అని తేలింది. దీనికోసం ఎలుకలపై పరిశోధనలు చేశారు. ఉపవాసం చేయడం వల్ల క్యాన్సర్‌కు వ్యతిరేకంగా శరీరం సహజమైన రక్షణ వ్యవస్థను శక్తివంతం చేస్తుందని పరిశోధనలలో తేలింది. సహజ కిల్లర్ కణాల పనితీరు మెరుగపడి క్యాన్సర్ కణాలపై దాడి చేసే అవకాశం ఉంది అని గుర్తించారు. ముఖ్యంగా మారుతున్న జీవన ప్రమాణాలు, లైఫ్ స్టైల్ వల్లే అనేక రకాల క్యాన్సర్లు విజృంభిస్తున్నాయి.

