డబుల్ ఇంజన్ సర్కారుతో ఏపీలో వేగంగా అభివృద్ధి…ఏపీ మంత్రి
కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఏపీ అభివృద్ధి పరుగులు పెట్టబోతోందని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోయిందని, గత నేతలు సహజవనరులను దోచుకున్నారని విమర్శించారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎన్డీయే సర్కారులో భాగం కావడం వల్ల కేంద్ర నిధులు సాధించి, రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించే ప్రభుత్వం అని, ఏపీలో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఏపీని నెంబర్ 1గా చేస్తామని పేర్కొన్నారు.

