Home Page SliderTelangana

“వ్యవసాయం అంటే అమెరికాలో అంట్లు తోమడం కాదు డ్రామారావు”: రేవంత్ రెడ్డి

తెలంగాణా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార పక్షంపై ప్రతిపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణాలో రైతులకు ఇచ్చే ఉచిత కరెంటు విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు తెలంగాణా రాజకీయాల్లో తీవ్రదుమారం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి మరోసారి మంత్రి కేటీఆర్‌పై మండిపడ్డారు. “వ్యవసాయం అంటే అమెరికాలో అంట్లు తోమడం కాదు డ్రామారావు”  అంటూ రేవంత్ రెడ్డి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఎపుసం అంటే జూబ్లీహిల్స్ గెస్ట్‌హౌస్‌లలో సేద తీరడం,సినిమా వాళ్లతో పార్టీలు చేసుకోవడం కాదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయం అంటే మట్టి మనసుల పరిమళం అని ఆయన వ్యాఖ్యానించారు. అయినా ప్రతి ప్రసంగంలో ఎడ్లు-వడ్లు అని పాకులాడే గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన అంటూ రేవంత్ రెడ్డి కేటీఆర్‌ను ఘాటుగా విమర్శించారు.