ప్రముఖులు, భూస్వాములు, వ్యాపార వర్గాలకు రైతు బంధు కట్?
తెలంగాణ: రైతు బంధు పథకంలో కీలక మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అధికారులు, ఉద్యోగులు, ప్రముఖులు, భూస్వాములు, వ్యాపార వర్గాలకు నిలిపివేసే దిశగా కసరత్తు చేస్తోంది. త్వరలో మార్గదర్శకాలు జారీచేసి వచ్చే వానాకాలం నుండి అమలు చేయాలని భావిస్తోంది. రైతు బంధుకు 5 లేదా 10 ఎకరాల పరిమితి విధిస్తారని తెలుస్తుండగా.. సన్న, చిన్నకారు రైతులకే సాయం అందించేలా మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు సమాచారం. ఈ విధంగా చేస్తే కనుక అట్టడుగు రైతులు, కౌలు రైతులకు, నిజమైన లబ్ధిదారులకు రైతు బంధు అందుతుందని ప్రభుత్వ ఆలోచన.